అవినీతి రాజకీయ నాయకులకు మావోయిస్టు పార్టీ హెచ్చరిక

by Kalyani |
అవినీతి రాజకీయ నాయకులకు మావోయిస్టు పార్టీ హెచ్చరిక
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పేరుతో అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి దళిత బంధు ఇప్పిస్తామని ఆశలు చూపిన నేతలకు భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ మంగళవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరిక జారీ చేశారు.దళిత బంధు మొదటి విడత రెండో విడత అని లక్షల రూపాయలు తీసుకొని ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురిచేస్తున్న రాజకీయ బ్రోకర్స్ లారా ఖబర్దార్ ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకొని తిరిగి ప్రజల దగ్గర తీసుకున్న రూపాయలు ఇవ్వాలని జగన్ హెచ్చరించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహా ముత్తారం మాజీ జెడ్పిటిసి మండల రాజిరెడ్డి, మార్క రామ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పక్కల సడవలి, మాజీ జెడ్పిటిసి భర్త లింగమల దుర్గయ్య, మాజీ ఎంపీపీ భర్త రత్నం సడవలి, పీసీసీ మెంబర్ బెల్లంకొండ కిష్టయ్య, కాటారం మాజీ ఎంపీటీసీ తోట జనార్దన్, మాజీ జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని భర్త రాకేష్, భూపెళ్లి రాజు, మహాదేవపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, మహాదేవపూర్ మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు, పలిమెల బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జువాజి తిరుపతి, మలహర్ రావు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు, భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, కొత్తపల్లి హరిబాబు ప్రజల దగ్గర తీసుకున్న డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని ఇవ్వని ఎడల ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ రాజకీయ పార్టీల నాయకులను తీవ్రంగా హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed