- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు.. అధికారులపై భూ నిర్వాసితుల ఆగ్రహం
దిశ, మల్హర్: తాడిచర్ల ఉపరితల బొగ్గు నిక్షేపాలను వెలికి తీస్తున్న ప్రదేశంలో ముంపుకు గురైన కాపురం భూ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వడంలో అధికారులు మొండిచేయి చూపుతున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. తాడిచర్ల, కాపురం గ్రామాల నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని తాడిచర్ల పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూ నిర్వాసితుల సమావేశానికి ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు, తాసీల్దార్ శ్రీనివాస్ పాల్గొని భూ నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ ఎంపిక జాబితాను నిర్వాసితుల ముందు చదివి వినిపించారు. కాపురంలో 217మంది నిర్వాసితులు లబ్ధిదారులు ఉండగా, కేవలం 57 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి 160 మందిని అనర్హులుగా ప్రకటించారు.
తాడిచర్లలో 103 మంది లబ్ధిదారులు ఉండగా, 40 మందిని అర్హులుగా గుర్తించి 63 మందిని అనర్హులుగా ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. కాపురంలోని నిర్వాసితులకు 2014 నుండి 2017 వరకు 18 ఏళ్లు నిండిన వారికి, తాడిచర్లలో 2005 నుండి 2008 వరకు 18 ఏళ్లు నిండిన నిర్వాసితులకు కటాఫ్ తేదీ కింద గుర్తించామని తెలిపారు. ఏమైనా తప్పిదాలు జరిగితే, అర్హులైన నిర్వాసితులు సరైన ధ్రువపత్రాలు అందజేస్తే మళ్లీ సర్వే చేసి, అర్హులుగా గుర్తించి పునరావాస ప్యాకేజీ అందజేస్తామని హామీ ఇచ్చారు. దీనికి ఆగ్రహించిన తాడిచర్ల, కాపురం నిర్వాసితులు అందరికీ పునరావాస ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వడంలో మొండిచేయి చూపిందని, అర్హులైన నిర్వాసితులు అందరికీ 2019 సంవత్సరానికి 18 ఏళ్లు నిండిన ప్రతీ నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు న్యాయం జరుగకపోతే ఎమ్మార్ కంపెనీ చేపడుతున్న వెలికితీత పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి సత్తయ్య, ఎంపీటీసీ రావుల కల్పన మొగిలితో పాటు ప్రజలు పాల్గొన్నారు.