- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దోపిడీ ముఠా గుట్టురట్టు చేసిన కేయూ పోలీసులు
దిశ, హనుమకొండ : కాకతీయ యూనివర్సిటీ పోలీసులు దోపిడీ ముఠా గుట్టురట్టు చేశారు. శనివారం ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి, 24 వేల రూపాయల నగదు, ఒక ఆటో,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈజీ మనీకి అలవాటు పడి లక్ష్మీ అనే మహిళను గోదారి శేఖర్ ట్రాప్ చేసి, లక్ష్మితో పరిచయం పెంచుకొని ఆమె ఐడి ప్రూఫ్ తో సిం కార్డులు కొని జోడి డాట్ కామ్ లో లక్ష్మీ పేరుతో శేఖర్ ఐడి క్రియేట్ చేశారు.అనంతరం పంతంగి గ్రామానికి చెందిన దేవులపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకొని శేఖర్ ఆడ గొంతుతో మాట్లాడి నమ్మించాడు. 24 తారీఖున వచ్చి తనను కలవాల్సిందిగా శ్రీనివాస్ కు శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు. ముందస్తు పథకం ప్రకారం తన బంధువు రాజయ్య, లక్ష్మయ్య కోమటిపల్లి రైల్వే ట్రాక్ దగ్గరికి పిలిచి దాడి చేసి బలవంతంగా అతని నుండి 24 వేలు లాక్కున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, లక్ష్మి అనే మహిళ పరారీలో ఉందని తెలిపారు.