- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలైన ప్రేమ వరంగల్ తూర్పులోనే ఉంది : కొండా దంపతులు
దిశ, కరీమాబాద్ : కొంతమంది చెప్పుడు మాటలు విని వరంగల్ తూర్పు నియోజకవర్గం వదిలి పరకాలలో పోటీ చేశామని అసలైన ప్రేమ వరంగల్ తూర్పు లోనే ఉందని కొండా దంపతులు అన్నారు. హత్ సే హత్ జోడో అభిమాన్ యాత్ర ఫర్ చేంజ్ పేరుతో గురువారం కాంగ్రెస్ నాయకులు కొండ దంపతులు దేశాయిపేటలోని బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం కొండ సురేఖ మాట్లాడుతూ.. అసలైన ప్రేమ వరంగల్ తూర్పు లోనే ఉందని నేను పరకాలకు వెళ్లి తప్పు చేశానని నాలుగేళ్లలో భూకబ్జాలు, వ్యాపారస్తులను దోచుకోవడం పెరిగిపోయిందని, మీకు అండగా కొండ దంపతులు ఉంటారని ఏ సమస్యలు వచ్చిన కూడా తమ వద్దకు రావచ్చని, బొడ్రాయి సాక్షిగా మీరందరూ కొండ సురేఖను దీవించాలని కోరారు. అనంతరం సుష్మిత పటేల్ మాట్లాడుతూ రేషన్ షాపులో ఎందుకు ఏడు రకాల వస్తువులు ఇవ్వట్లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా అని కొండ దంపతులు తూర్పులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్ గారడి మాటలకు, డబ్బులకు దూరంగా ఉండాలని, తూర్పు ప్రజల భవిష్యత్తు బాగుంటుందని కొండా సుష్మిత పటేల్ అన్నారు.