జువైనల్ హోమ్ పిల్లలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలి

by Sridhar Babu |
జువైనల్ హోమ్ పిల్లలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలి
X

దిశ,మహబూబాబాద్ టౌన్ : జువైనల్ హోమ్ పిల్లలకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. మహబూబాబాద్ పట్టణంలోని జూవైనల్ హోమ్, ఇందిరానగర్, హెల్త్ సబ్ సెంటర్, అంగన్వాడీ సెంటర్, ఏబీసీ సెంటర్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జువైనల్ హోమ్ లో ఉన్న అనాథ పిల్లలు, ఇంటి నుంచి పారిపోయినవారు, మాదకద్రవ్యాలకు బానిసలైన పిల్లలు, చిన్న చిన్న కేసుల్లో ఉన్న బాల నేరస్తులు 11 మంది పిల్లల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హోమ్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత సమాజంలో ఎలా ఉండాలి అనే విషయంపై పిల్లలకు వివరించి వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇవ్వాలని సూపరింటెండెంట్​ కృష్ణవేణి, సునీల్ బాబును ఆదేశించారు. మున్సిపల్ పరిధి శనిగపురం ఒకటవ వార్డులో ఉన్న (ఏబీసీ) ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరానగర్ లోని హెల్త్ సబ్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ, ఆశ, ఏఎన్ఎం, ఆరోగ్య సిబ్బంది కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రవీందర్, సునీల్ బాబు, సంబంధిత సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed