రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. హెలికాప్టర్ల సాయంతో గ్రామస్థులను కాపాడిన రెస్క్యూ సిబ్బంది

by Javid Pasha |
రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. హెలికాప్టర్ల సాయంతో గ్రామస్థులను కాపాడిన రెస్క్యూ సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో వరదల్లో చిక్కుకున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ సిబ్బంది కాపాడారు. వరదల్లో చిక్కుకున్న గ్రామస్థులను రెండు హెలికాప్టర్లు, 6 బోట్ల సాయంతో రక్షించారు. కాగా అంతకు ముందు గ్రామస్థులు వరద నీటిలో చిక్కుకోవడంతో అంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే సకాలంలో రెస్క్యూ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టడంతో గ్రామస్థుల ప్రాణాలతో బయటపడ్డారు. ఇక వరద ఉధృతి నేపథ్యంలో అంతకు ముందే గ్రామస్థులందరినీ ఖాళీ చేయించారు.

Advertisement

Next Story