చదువుకోవడం మీ వంతు... అండగా ఉండడం నా వంతు...

by Disha Web Desk 15 |
చదువుకోవడం మీ వంతు... అండగా ఉండడం నా వంతు...
X

దిశ, కాటారం : విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడం, భవిష్యత్తులో మీరేం కావాలనుకున్నారో చేయడం మీ వంతు అని, పేద విద్యార్థిని విద్యార్థులకు అండగా ఉండి చదివేలా కృషి చేయడం నా వంతు అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మండలంలోని గారేపల్లి గ్రామానికి చెందిన మైనారిటీ విద్యార్థిని షేక్ హీన మొదటి, ద్వితీయ సంవత్సరంలో సీఈ సీ గ్రూప్ లో 986 మార్కుల తో స్టేట్ ర్యాంకు సాధించడంతో మంత్రి శ్రీధర్ బాబు ఆమెను శాలువాతో సత్కరించారు. భవిష్యత్తు లక్ష్యం ఏమిటి అంటూ విద్యార్థిని మంత్రి ప్రశ్నించగా ఐఏఎస్ కావాలని ఆకాంక్ష ఉందని, అదే లక్ష్యంతో చదువుకుంటున్నానని తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఉన్నత లక్ష్యం మేరకు చదువుకోవాలని, అండగా ఉంటానని శ్రీధర్ బాబు విద్యార్థినికి హామీ ఇచ్చారు. అలాగే మైనారిటీ విద్యార్థినిలు అబిత తంజీత్ ఇంటర్ ఫస్టియర్ లో ఎంపీసీ గ్రూపులో 466 మార్కులతో స్టేట్ మూడో ర్యాంకు సాధించింది. బైపీసీ గ్రూపు రెండవ సంవత్సరంలో విద్యార్థిని సానియా 980 మార్కులు, మర్రిపల్లి గ్రామానికి చెందిన మీర్జా ఇక్రాన్ బేగ్ బైపీసీలో 944 మార్కులు సాధించారు. చింతకాని గ్రామానికి చెందిన మైమున్ ఇంటర్ 2 లో ఎంపీసీ గ్రూపులో 937 , గారెపల్లికి చెందిన ఆదిబా సీఈసీలో 931 , శాపియా 912, షేక్ మహబూబ్ బి 908 మార్కులు సాధించారు. మండలంలో మైనార్టీ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో స్థానిక మసీదులో మైనార్టీ లందరూ పెద్ద ఎత్తున పౌర సన్మానం ఒక పండుగలా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.



Next Story