ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 3 వ్యభిచార గృహాలపై దాడి

by Disha Web Desk 11 |
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 3 వ్యభిచార గృహాలపై దాడి
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో బుధవారం రాత్రి మూడు వ్యభిచార గృహాలపై సిసిఎస్, పట్టణ పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు ఆదిలాబాద్ సిసిఎస్ పోలీసులు, పట్టణ పోలీసులు సంయుక్తంగా పట్టణంలోని పలు వ్యభిచార గృహాలపై దాడిని నిర్వహించారు. నిర్వాహకులతో పాటు విటులను అదుపులోకి తీసుకున్నట్లు గురువారం మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ డీఎస్పీ మాట్లాడుతూ… ఆదిలాబాద్ పట్టణం, మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, టీచర్స్ కాలనీ లో అలాగే ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ లో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయడం జరిగిందన్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలు, 9 మంది పురుషులు అరెస్టు చేసినట్లు తెలియజేశారు.

మూడు చోట్ల విడివిడిగా

న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో పట్టుబడ్డ వారిలో శాంతి నగర్ లోని గణేష్ ఫైనాన్స్ బిజినెస్ కు చెందిన హెచ్ వంశీకృష్ణ, న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ లోగల ఎన్జీవో కోఆర్డినేటర్ కే బాబాసాహెబ్ తరుణ్, శాంతి నగర్ కాలనీకి చెందిన ఎస్ అశోక్ లు ఉండగా కపిల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా టీచర్స్ కాలనీలో పట్టుబడ్డ నిందితుల్లో ఇదే కాలానికి చెందిన ఎన్ రవితేజ, ఉండగా గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామానికి చెందిన కే విశాల్, విద్యానగర్ లో పట్టుబడ్డ నిందితుల్లో... గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ సలీం, పట్టణంలోని మహాలక్ష్మి వాళ్ళకి చెందిన అద్నాన్ అహ్మద్,ఎండి అజీముద్దీన్ లు ఉన్నారు.

మొత్తంగా ముగ్గురు మహిళలు, 9 మంది మగవారిపై మావల పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 137 138 లతో, ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో 166 తో అండర్ సెక్షన్ 3 , 4 , 5 ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ - 1956 తో కేసులు నమోదు చేయబడినట్లు తెలియజేశారు. ముఖ్యంగా నిర్వాహకుడైన కే బాబా సాహెబ్ @ తరుణ్, శూర్ ఎన్జీవో ద్వారా నియమితుడై, హెచ్ఐవి పై అవగాహన పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అమాయకులైన మహిళలను ఉచ్చులోకి లాగుతూ బలవంతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్జీవో ప్రతినిధులుగా తరుణ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై నివేదికను పంపనున్నట్లు తెలియజేశారు.

బాధిత మహిళలకు పునరావాస కల్పించే విధంగా సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లావ్యాప్తంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలైనా, వ్యవస్థీకృత నేరాలను నిర్వహించే వారినైన సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారని పేర్కొన్నారు. వీరి నుంచి రూ. 7,500/- నగదు, 11 సెల్ ఫోన్లు, నాలుగు మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.ఈ దాడుల్లో ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిధర్, ఆదిలాబాద్ రెండో పట్టణ సీఐ అశోక్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మావల ఎస్ఐ వి విష్ణువర్ధన్, సిసిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed