- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణకు ఊరట.. బెయిల్ మంజూరు
దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసులో జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణకు బెయిల్ దొరికింది. 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిట్ నుంచి అభ్యంతరాలు వినడానికి జడ్జి జస్టిస్ ప్రీత్ జె నిరాకరించారు. బెయిల్ ని మంజూరు చేశారు.
ఏప్రిల్ 28న హోలెనరసిపురా టౌన్ పోలీస్ స్టేషన్‌లో రేవణ్ణపై కేసు నమోదైంది. తన ఇంట్లో పనిచేసే 47 ఏళ్ల మహిళ.. రేవణ్ణ, అతడని కుమారుడు ప్రజ్వల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. దీంతో వారిద్దరిపై కేసు నమోదైంది.
హెచ్‌డీ రేవణ్ణను మే 4న అరెస్టు చేసి నాలుగు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. తర్వాత ఆయన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. జ్యుడీషియల్ కస్టడీ ముగిసే సమయానికి.. ప్రత్యేక కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇక, సంచలన సృష్టించిన హసన సెక్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయారు. అతడిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయ్యింది. మరోవైపు, పరారీలో ఉన్న ప్రజ్వల్ పై ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది.