- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆప్‌కు రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు అందాయి: ఈడీ
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని తొలిసారిగా నిందితుల జాబితాలో చేర్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా, ఆప్ 2014 నుంచి 2022 వరకు రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను అందుకుందని, దీని ద్వారా పార్టీ విదేశీ విరాళాలా నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్ఏ), ప్రజల ప్రాతినిధ్య చట్టం(ఆర్‌పీఏ), ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లను ఉల్లంఘించినట్టు ఈడీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. ఈడీ వివరాల ప్రకారం, 'ఆమ్ ఆద్మీ పార్టీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్‌తో సహా వివిధ దేశాల నుంచి నిధులను అందుకుంది. విదేశీ దాతల వివరాలు గోప్యంగా ఉంచడం, నేషనాలిటీతో పాటు విదేశీ విరాళాలకు సంబంధించిన అనేక వాస్తవాలను దాచడం, తప్పుడు వివరాలు అందించడం, మార్పులు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్టు' ఆరోపణలు చేసింది. ఈడీ తమ దర్యాప్తులో ఆప్, ఆ పార్టీ నేతలు విదేశీ నిధుల సేకరించడంలోని అవకతవకలకు పాల్పడ్డారని తెలిపింది. 2016లో కెనడాలో జరిగిన నిధుల సేకరించిన దాంట్లో ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌తో సహా కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని స్పష్టం చేసింది. ఈ వివరాలు అనికేత్ సక్సేనా (ఆప్ ఓవర్సీస్ ఇండియా కోఆర్డినేటర్), కుమార్ విశ్వాస్ (ఆ సమయంలో ఆప్ ఓవర్సీస్ ఇండియా కన్వీనర్), కపిల్ భరద్వాజ్ (ఒకప్పటి ఆప్ సభ్యుడు), దుర్గేష్‌తో సహా వివిధ ఆప్ వాలంటీర్లు, నిర్వాహకుల మధ్య జరిగిన ఈ-మెయిల్‌లలోని విషయాల ద్వారా సాక్ష్యాలు లభించాయని ఈడీ పేర్కొంది.