Eyebrows : కనుబొమ్మలపై వెంట్రుకలు ఎందుకు రాలుతాయి?.. ఎలా నివారించాలి?

by Dishafeatures2 |
Eyebrows : కనుబొమ్మలపై వెంట్రుకలు ఎందుకు రాలుతాయి?.. ఎలా నివారించాలి?
X

దిశ, ఫీచర్స్ : తలవెంట్రుకలు రాలిపోవడం, బట్టతల రావడం వంటి ఇబ్బందులను పలువురు ఎదుర్కొంటూ ఉంటారు. హార్మోన్లలో అసమతుల్యత, వాతావరణ కాలుష్యం, జన్యుపరమైన అంశాలు, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం అవుతుంటాయి. అయితే ఇటీవల కనుబొమ్మలపై గల వెంట్రుకలు రాలిపోయే ప్రాబ్లంను కూడా అనేక మంది ఫేస్ చేస్తున్నారు. దీంతో తమ ముఖ సౌందర్యం దెబ్బతింటుందని బాధపడేవారు లేకపోలేదు. అయితే ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలో చూద్దాం.

* శరీరానికి అన్ని రకాల పోషకాలు అందినప్పుడే మనం హెల్తీగా ఉంటాం. అవసరమైన శక్తి, హార్మోన్లు విడుదలవుతాయి. ఎప్పుడైతే పోషకాలు లోపిస్తాయో అప్పుడు బాడీలో వివిధ మార్పులు జరగుతాయి. అలాంటి వాటిలో కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోవడం కూడా ఒకటి. తీసుకునే ఆహారంలో దీర్ఘకాలంపాటు జింక్, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12 లోపిస్తే ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి తగిన పోషకాలు ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

* హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఐబ్రోస్‌పై వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మహిళలు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అలా జరగవద్దంటే తగిన హార్మోన్లు అందే ఆహారాలు తీసుకోవాలి. వైద్య పరీక్షల ద్వారా శరీరంలో హార్మోనల్ లెవల్స్‌ను నిర్ధారించుకొని ఇంబ్యాలెన్స్ పోగొట్టుకోవడం ద్వారా వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోతుంది.

* బిజీ లైఫ్ షెడ్యూల్, హెవీ స్ట్రెస్ వల్ల కూడా కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోతాయి. ఎందుకంటే మానసిక అనారోగ్యం శరీర పనితీరును మందగించేలా ప్రేరేపిస్తుంది. ప్రతికూల ఆలోచనలు వెంటాడుతాయి. దీనివల్ల మెదడులో హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కావు. ఈ ప్రభావం త్వరగా వృద్ధాప్య ఛాయలు రావడానికి, తల, కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవడానికి కారణం అవుతుంది.

* ఇక నివారణ విషయానికి వస్తే వైద్య నిపుణులను, ముఖ్యంగా డెర్మటాలజిస్టులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పాటించడం ద్వారా పరిష్కారం లభిస్తుంది. అలాగే కొన్ని హోమ్ రెమడీస్ కూడా పనిచేస్తాయని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. ఆలివ్ ఆయిల్, కొబ్బరి పాలు, ఆముదం నూనెలు కనుబొమ్మలపై వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తాయి. వీటిలో ఏదో ఒకదానిని రోజూ కనుబొమ్మలపై రాస్తూ ఉంటే వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి. ఒత్తుగా పెరుగుతాయి.

Next Story

Most Viewed