- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అడవుల్లో శాఖాహార జంతువుల గణన
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతం అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ( ఏటీఆర్) లో అమ్రాబాద్, అచ్చంపేట, నాగార్జునసాగర్ మూడు డివిజన్లు ఉన్నాయి. పై మూడు డివిజన్ లో ఇప్పటికే అచ్చంపేట నాగార్జునసాగర్ డివిజన్ శాఖాహార జంతువుల సర్వే పూర్తి చేయాగ.. నేడు ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు అమ్రాబాద్ డివిజన్ లో సర్వే చేపడుతున్నట్లు మన్ననూర్ అటవీ క్షేత్ర అధికారి ఈశ్వర్ తెలిపారు. నల్లమల్ల లోని అమ్రాబాద్ డివిజన్ లో 25 పెద్ద పెద్ద పులులు ఉండగా వాటిలో 12 కపుల్స్ ఉన్నాయని, వీటిలో నాలుగు పెద్ద పులులు పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. వాటికి కావలసిన ఆహారం సమృద్ధిగా ఉందా లేదా అనే విషయంపై ఈ సర్వే ఆధారంగా తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ఏరియా 20611 స్క్వేర్ కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెంది ఉంది.
ఈ సర్వే ఎందుకు..
అటవీ వన్యప్రాణుల సంరక్షణ లో భాగంగా జిల్లాలోని అమ్రాబాద్ డివిజన్ పరిధిలో మన్ననూర్, అమ్రాబాద్, మద్దిమడుగు, దోమలపెంట రేంజ్ లలో సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే నిర్వహించేందుకు ప్రధాన కారణం... మాంసాహార జంతువులైన జాతీయ జంతువు పెద్దపులి, చిరుతపులి లాంటి వాటికి ఏ మేరకు ఆహారాన్ని ఇచ్చే శాఖాహార జంతువులు ఎన్ని ఉన్నాయో అంచనా వేసేందుకు (ఎన్ టి సి ఏ) నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ న్యూఢిల్లీ వారి ఆదేశానుసారం సర్వే చేయనున్నారు.
సర్వే జరిగే విధానం...
పై రేంజ్ లలో సుమారు నూట నలభై బిట్స్ లో ఈనెల 21 నుంచి 23 వరకు ఉదయం 6 గంటలకు ప్రతి బిట్లో ఒక స్ట్రీట్ లైన్ ద్వారా ఇద్దరు వ్యక్తులు రెండు కిలోమీటర్ల దూరం మొబైల్ డేటా ఫోటో షూటింగ్ ద్వారా శాకాహార జంతువులైన సాంబార్, జింక, చుక్కల దుప్పులు, అడవి పందులు తదితర వాటిని ఏ ప్రదేశంలో అధికంగా ఉన్నాయి వాటికి కావలసిన ఎలాంటి వనరులు కావాలో అంచనా వేసేందుకు ఈ సర్వే నిర్వహిస్తారు తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ ప్రదేశాలలో నీటి వనరులు గ్రాస్ ల్యాండ్స్ మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటారు...
సర్వే పై శిక్షణ...
శాకాహార జంతువుల సర్వే కోసం బీట్ ఆఫీసర్లు 60 శిక్షణ ఆఫీసర్లు 30 13 మంది నేచర్ గైడ్స్ వాచర్లు డ్రైవర్లు వీరందరికీ శిక్షణ నిర్వహించారు శిక్షణలో పొందిన అంశాల ప్రకారం మూడు రోజులు తెల్లవారుజామున ఉదయం 5:00 గంటలకు తెచ్చుకున్న ప్రదేశాలకు వెళ్లి సర్వే నిర్వహిస్తారు.
ఏర్పాట్లు పూర్తి ...
శాఖాహార జంతువుల సర్వే పై మన్ననూర్ అటవీ శాఖ రేంజర్ ఈశ్వర్ ను 'దిశ' ఫోన్ ద్వారా సమాచారం కోరగా ఆయన మాట్లాడుతూ 21 నుంచి 23 వరకు సర్వే జరుగుతున్న విషయం వాస్తవం అని అందుకు సంబంధించి మా సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు రెండు పర్యాయాలు మూడు రోజుల పాటు ప్రతి బీట్ లో రెండు కిలోమీటర్ల పొడవు సర్వే నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.