మీరు మీ ఆఫీసులో జాబ్ మానేసి వేరే దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా?

by Jakkula Samataha |
మీరు మీ ఆఫీసులో జాబ్ మానేసి వేరే దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారా?
X

దిశ, ఫీచర్స్ : ఉద్యోగ మార్పు అనేది కామన్. చాలా మంది ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారుతుంటారు. అయితే కొంత మంది ఒక సంస్థలో చేరిన తర్వాత అక్కడ వారికి ఉన్న కంఫర్ట్, ఫైనాన్షియల్ స్టేటస్, వాల్యూను బట్టి కొనసాగుతారు. వారికి అన్ని విధాల అక్కడే బాగుంది అనుకున్నప్పుడు ఆఫీసు మారాలి అనే ఆలోచన రాదు. కానీ కొంత మంది మాత్రం మెరెగైన ఉద్యోగం కోసం వెళ్తుంటారు. ఇంకో దగ్గర ఇక్కడికంటే బెస్ట్‌గా ఉంది అనిపిస్తే వెంటనే జంప్ అయిపోతారు. అయితే ఉద్యోగం మారే సమయంలో కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కెరీర్ : ముందుగా మీరు వెళ్లే ఆఫీసు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అందులో జాయిన్ అయిన తర్వాత మీకు దాని నుంచి మంచి గుర్తింపు రావాలి. అదే విధంగా తొందరపాటుగా ఉద్యోగాన్ని వదులు కోకూడదు ఎందుకంటే అది మీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరు ఏదైనా జాబ్ చూసుకున్న తర్వాతే ఉద్యోగం మానేయాలి. అదే విధంగా మీరు ఎంచుకునే ఆఫీసులో మీ పొజిషన్ కూడా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే దాని బట్టీ మీ భవిష్యత్తు నిర్ణయించబడి ఉంటుంది.

ఫైనాన్షియల్ స్టేటస్ : మీరు జాబ్ మానేసే మూడు నెలల ముందే మీరు ఖర్చులు తగ్గించుకొని పొదపు చేసుకో వాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే మీరు జాబ్‌లో జాయిన్ కాకపోతే మీరు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక వేళ మీరు జాబ్ చూసుకొని ఉద్యోగం మానేసినా మీరు పొదుపు చేసిన మనీ మీకు ఆదాయంగా మిగులుతాయి.

స్ట్రాంగ్‌గా ఉండాలి : కొంత మందికి జాబ్ వదిలి వేయడం మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే దానిని మీరు తట్టుకోగలిగే శక్తిని కూడగట్టుకోవాలి. మీ వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, ఫైనాన్షియల్ ఇలా చాలా విషయాలను చూసుకొని జాబ్ మానేయాలి. ముఖ్యంగా మంచి ఆఫర్ వస్తే తప్ప జాబ్ మానేయకూడదు అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story