ICICI Bank Scam Case: సీఐడీ అధికారుల దూకుడు.. కీలక ఆధారాలు సేకరణ

by srinivas |
ICICI Bank Scam Case: సీఐడీ అధికారుల దూకుడు.. కీలక ఆధారాలు సేకరణ
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడ భారతినగర్‌ ఐసీఐసీఐ బ్యాంక్(ICICI BANK)​ బ్రాంచ్‌ల్లో కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగింది. గతంలో మేనేజర్‌గా పని చేసిన నరేష్​ ఖాతాదారుల అకౌంట్ల నుంచి రూ. 28 కోట్లు కొట్టేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసిన డబ్బులకు నకిలీ డిపాజిట్ సర్టిఫికెట్లు ఇచ్చి కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు తేలింది. బ్యాంకు ఖాతాదారుల నగదు, బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న నగదును సైతం మాయం చేశారు. రెండు నెలలుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ ఖాతాకు జమకాకపోవడంతో బాధితులు బ్యాంకుకు వెళ్లి ఆరా తీసింది. దీంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది.

అయతే ఈ కేసును సీఐడీకి అప్పగించారు. దీంతో సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. విజయవాడ ICICI బ్యాంక్‌ స్కాంపై లోతైన విచారణ చేపట్టారు. ఖాతాదారులకు బ్యాంక్‌ నుంచి కాకుండా, ఇతర కరెంట్‌ అకౌంట్స్‌ ద్వారా వడ్డీ చెల్లింపులు జరిపినట్లు గుర్తించారు. అనుమానాస్పద కరెంట్‌ అకౌంట్స్‌ వివరాలు సేకరించారు. BAFGGI ట్రేడింగ్‌ సంస్థ పేరుతో శివ నాగేశ్వర రావు అకౌంట్‌, KSGF EXPORTS పేరుతో సాయి గణేష్‌, MSRASU అసోసియేట్స్‌ పేరుతో శ్రీనురెడ్డిపై ఉన్న ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాల చిరునామాలన్నీ చిలుకలూరిపేటలో ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed