- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Terrible incident:మహిళ దారుణ హత్య.. వివస్త్రగా ఉండటంతో ఎన్నో అనుమానాలు!?
దిశ,కడప: వైఎస్ఆర్ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. గత నెల రోజుల క్రితం బద్వేలు సమీపంలోని గోపవరం మండలం అటవీ ప్రాంతంలో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మరువక ముందే మరొక కాశీనాయన మండలం లో మహిళను దారుణ హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. ఒంటిపై వస్త్రాలు లేకుండా చేసి, ముఖం గుర్తు పట్టకుండా నుజ్జు నుజ్జు చేశారు. ఈ దారుణ ఘటన కాశినాయన మండలం చెన్నవరం - పాపిరెడ్డిపల్లె గ్రామాల మధ్యలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ పై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్య కాబడిన మహిళా శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేక పోవడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్య కాబడిన మహిళ ఎవరు అనే ఆనవాళ్లు లేకుండా మృతురాలి తల పై రాళ్లతో నుజ్జు నుజ్జుగా కొట్టారు. సంఘటనా స్థలాన్ని మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హత్యకు గురైన మహిళ చేతి పై ఉన్న టాటూను బట్టి చాపాడు మండలం ఖాదరపల్లి గ్రామానికి చెందిన కరీమున్నీసా (35) గుర్తించామన్నారు. హత్య విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారన్నారు. మహిళ తల పై , ముఖం పై ఆమెను గుర్తు పట్టలేని విధంగా రాయితో కొట్టి చంపారన్నారు. ఆమె భర్త నాజిల్ కు సమాచారం అందించామని, కుటుంబ సభ్యులు వస్తున్నారన్నారని వారు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అంతే కాకుండా క్లూస్ టీంను రప్పించి పరిశోధిస్తున్నామన్నారు. ఈ హత్య ఎవరు చేశారనే దాని పై దర్యాప్తు ముమ్మరం చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించి ఈ హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తామన్నారు. కాశినాయన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.