CM Cup : రేపటి నుండి సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలు

by Y. Venkata Narasimha Reddy |
CM Cup : రేపటి నుండి సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్ (CM Cup)2024 కు సంబంధించిన రాష్ట్రస్థాయి పోటీలు రేపటి(Tomorrow) నుంచి జనవరి 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ(Telangana Sports Authority) ఆధ్యర్యంలో పోటీలకు ఏర్పాట్లు చేశారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించాలన్న ఆశయంతో పాటు పల్లెల నుంచి ప్రపంచ ఛాంపియన్లను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ 2024 క్రీడా పోటీలను నిర్వహిస్తుంది. గ్రామస్థాయి, మండల, జిల్లా స్థాయి పోటీలు పూర్తి కాగా.. డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగనున్నాయి.

పండుగ వాతావరణంలో జరుగనున్నాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి (Chairman Shiv Sena Reddy)తెలిపారు. ఈ పోటీల్లో భాగంగా దాదాపు రెండు లక్షల మందికి పైగా క్రీడాకారుల సమాచారాన్ని గేమ్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా సంక్షిప్తం చేశారని, క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందజేయడం, క్రీడలకు ఆధునిక సాంకేతిక హంగులు సమకూర్చడం, రాబోయే తరానికి దిక్సూచిలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోందని, ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed