ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఆఫర్ వచ్చినప్పుడు ఫస్ట్ షాక్ అయ్యాను.. రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-03-29 07:43:27.0  )
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఆఫర్ వచ్చినప్పుడు ఫస్ట్ షాక్ అయ్యాను.. రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అందులో ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికిందర్’(Sikindar). ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా నటిస్తున్నాడు. అలాగే కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీ రోల్ ప్లే చేస్తుంది. కాగా ఈ మూవీ భారీ అంచనాల నడుమ మార్చి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల జోరులో ఉన్నారు. ఈ క్రమంలో రష్మిక మందన్న చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ.. ‘నాకు ఫస్ట్ టైం సికిందర్ సినిమాలో నటించాలనే కాల్ వచ్చినప్పుడు అది నాకు చాలా షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే నేను ఫస్ట్ యాక్టర్ కావాలని అనుకోలేదు.

కానీ ఏదో ఒక విధంగా యాక్టర్ అయ్యాను. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాను. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందంటే ఇంతకముందు సినిమాల్లో బాగా నటించినట్లు భావించాను. ఎందుకంటే.. ఒకవేళ నా యాక్టింగ్ నచ్చకపోతే ఈ అవకాశం వచ్చేది కాదు కదా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Read More..

పెళ్లి కాకుండానే ఇద్దరు బాబులతో దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ.. ఆ డేట్ అంటూ పోస్ట్

Next Story