Murmu: రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్

by vinod kumar |
Murmu: రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah), విదేశాంగ మంత్రి జైశంకర్‌ (Jai shanker) లు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi murmu) ను కలిశారు. పహెల్గాం ఉగ్ర దాడి, ప్రస్తుతం భారత్ పాక్ మధ్య జరుగుతున్న పరిణామాలను ముర్ముకు వివరించినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి భవన్ రిలీజ్ చేసింది. ముర్ముతో ఇద్దరు కేంద్ర మంత్రులు సమావేశమైనట్టు తెలిపింది. అయితే ఏయే విషయాలను చర్చించారు అనే విషయాలను వెల్లడించలేదు. అఖిలపక్ష భేటీకి ముందే రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు భారత గూఢచార సంస్థ (Raw), హోం మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

దౌత్య వేత్తలకు భారత్ వివరణ

పహల్గామ్ ఉగ్రవాద దాడిపై 20 దేశాల దౌత్యవేత్తలకు భారత్ వివరణ ఇచ్చింది.అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఖతార్, జపాన్, చైనా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల అగ్ర దౌత్యవేత్తలను భారత విదేశాంగ శాఖ ఢిల్లీకి పిలిపించింది. 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ రాయబారులకు దాడిపై వివరించారు.



Next Story

Most Viewed