‘కేసరి-2’ నుంచి హీరోయిన్ పోస్టర్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్.. అస్సలు ఊహించలేదంటున్న నెటిజన్లు

by Hamsa |
‘కేసరి-2’ నుంచి హీరోయిన్ పోస్టర్ విడుదల చేసి క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్.. అస్సలు ఊహించలేదంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) అందరికీ సుపరిచితమే. పలు చిత్రాల్లో నటించిన ఈ భామ అనుకున్నంత క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. అయినప్పటికీ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ‘కంట్రోల్’ చిత్రంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం అనన్య పాండే నటిస్తున్న తాజా సినిమా ‘కేసరి-2’(Kesari-2). ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar), ఆర్ మాధవన్(R Madhavan) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి’కి సీక్వెల్‌గా రాబోతుంది. దీనిని కరణ్ సింగ్ త్యాగి (Karan Singh Tyagi)తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని కరణ్ జోహార్(Karan Johar) ధర్మ ప్రొడక్షన్స్, అక్షయ్ కుమార్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ఆనంద్ తివారీ, అమ్ప్రిత్పాల్ సింగ్ బింద్రా నిర్మించనున్నారు.

ఈ సినిమా రఘు పలాట్, పుష్ప పలాట్ రాసిన పుస్తకం - ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్ ఆధారంగా రూపొందించబడింది. రఘు పలాట్ సి శంకరన్ నాయర్ మునిమనవడు కాగా.. ఈ కథ అతని జీవితంలోని కీలకమైన భాగం ఆధారంగా రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘కేసరి-2’ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. చిత్రబృందం వరుస అప్డేట్స్ వదులుతూ అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా, ‘కేసరి-2’ నుంచి మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్‌ను విడుదల చేశారు. ఈ సినిమా నుంచి యంగ్ బ్యూటీ అనన్య పాండే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో ఈ ముద్దుగుమ్మ దిల్‌రీత్ గిల్ పాత్రలో నటించబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ‘‘అభిరుచితో స్వీకరించబడింది. న్యాయానికి ఆజ్యం పోసింది. కేసరిలో అనన్య పాండేని దిల్‌రీత్ గిల్‌గా పరిచయం చేయబోతున్నాం’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె లాయర్ పాత్రలో నటిస్తుందని అస్సలు ఊహించలేదని అంటున్నారు.

Next Story

Most Viewed