- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Whatsapp: ఇకపై వాట్సప్ స్టేటస్‌లోనూ సాంగ్ యాడ్ చేయొచ్చు.. ఎలాగంటే?

దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను (Whatsapp) వినియోస్తుంటారు. మెటా యాజమాన్యంలోని ఈ యాప్‌కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్‌డేట్లను అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త సదుపాయంతో తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ తరహాలో వాట్సాప్ స్టేటస్‌లో కూడా తాత్కలికంగా పాటల్ని జోడించే ఫీచర్‌ని అందుబాటులో తెచ్చింది. వాట్సాప్ ఈ ఫీచర్‌ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఇప్పటికే చాలామంది యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
మ్యూజిక్ యాడ్ చేయాలంటే?
* వాట్సాప్ ఒపెన్ చేసి స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి.
* యాడ్ స్టేటస్ (Add status) ఆప్షన్‌పై క్లిక్ చేసి గ్యాలరీలో నచ్చిన ఫొటో లేదా వీడియోను ఎంచుకోవాలి.
* క్రాప్, స్టిక్కర్, టెక్ట్స్, ఎడిట్ ఆప్షన్లు సాధారణంగా స్క్రీన్‌పై కనిపిస్తాయి.
* వాటిముందే మ్యూజిక్ ఐకాన్ కొత్తగా ఒక ఆప్షన్ దర్శనమిస్తుంది.
* దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన పాటను ఎంచుకోవచ్చు.
* అయితే ఇలా ఫొటో కోసం 15 సెకన్లు, వీడియో కోసం 60 సెకన్ల వరకు పాటను ఎంచుకోవచ్చు.
* పాట ఎక్కడి నుంచి ప్లే కావాలని కోరుకుంటున్నారో అలా అడ్జెస్ట్ చేసుకొనే సదుపాయం కూడా ఉంది.