- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాలకృష్ణతో సినిమా.. హీరోయిన్ మీనాక్షి చౌదరి రియాక్షన్ ఏంటంటే?

దిశ, సినిమా: గతేడాది ‘ది గోట్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhury). అంతే కాకుండా ఈ ఏడాది వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో మరో సూపర్ హిట్ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడంతో ఈ యంగ్ హీరోయిన్ క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అలాగే.. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో కుర్రాళ్లను సైతం తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్ హీరోయిన్ టాలీవుడ్ నట సింహం బాలకృష్ణ(Balakrishna)తో కలిసి ఓ ఈవెంట్‌కు హాజరయ్యింది. అక్కడ బాలయ్య బాబుతో కలిసి మీనాక్షి చౌదరి సందడి చేసింది. ఈ క్రమంలోనే మీడియాతో కూడా ముచ్చటించారు బాలకృష్ణ అండ్ మీనాక్షి. ఇందులో భాగంగా.. ‘బాలకృష్ణతో మీరు సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా’ అనే ప్రశ్నపై మీనాక్షి స్పందిస్తూ.. ‘బాలకృష్ణ సార్‌తో సరైన స్క్రిప్ట్, రైట్ టైంకి వస్తే చేస్తాను. నా విష్ లిస్ట్‌లో ఉంది. అది ఈ ఇయర్‌లోనే జరగాలని కూడా నేను కోరుకుంటున్నారు. నేను అనుకున్నట్లుగా స్క్రిప్ట్ అండ్ టైమ్ కలిసి వచ్చి నాకు బాలయ్యతో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తాను. అలా నటించడానికి నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది.