- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BIGGEST CLASH: రజినీకాంత్ vs హృతిక్ రోషన్, జూనియర్ NTR

దిశ, వెబ్‌డెస్క్: జైలర్ చిత్రంతో రజినీకాంత్(Rajinikanth), ఆర్ఆర్ఆర్, దేవర వంటి చిత్రాలతో ఎన్టీఆర్(Jr. NTR), క్రిష్, ధూమ్ సిరీస్‌లతో హృతిక్ రోషన్(Hrithik Roshan) ఇండియా వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం హృతిక్ సినిమాలు సౌత్‌లో ఆడుతుండగా, రజినీ, ఎన్టీఆర్ చిత్రాలు నార్త్‌లో రాణిస్తున్నాయి. అయితే వచ్చే ఆగష్టులో ఈ ముగ్గురు కలిసి రాబోతున్నారు. కూలీ చిత్రంతో రజినీకాంత్, వార్-2తో హృతిక్, ఎన్టీఆర్ రాబోతున్నారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు ఆగష్టు 14వ తేదీన విడుదల చేసేందుకు డేట్‌ను లాక్ చేసి పెట్టుకున్నట్లు సమాచారం. ఇది జరిగితే.. భారత సినీ చరిత్రలో అతిపెద్ద క్లాష్ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, రజనీకాంత్ కూలీ చిత్రానికి(Coolie Movie) యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీతో ఖైదీ, తలపతితో మాస్టర్, లియో, కమల్‌తో విక్రమ్ వంటి సినిమాలు తీసి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ప్రస్తుతం తన అభిమాన హీరో అయిన రజినీకాంత్‌తో సినిమా కావడంతో ఈసారి అంతకుమించిన హిట్ కొట్టాలని లోకేష్ పక్కా ప్లాన్‌తో ఆగష్టులో దిగాలని ఫిక్స్ అయ్యారు.
మరోవైపు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా వార్-2(WAR -2) రాబోతోంది. ఇప్పటికే వార్ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో అభిమానుల అంచనాలు మరింత పెంచేలా హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తో మరింత థ్రిల్లింగా ఈ సినిమాను ఆయాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా అదే రోజున విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నారు. దీంతో చాలా ఎగ్జైటింగ్‌గా ఉందంటూ అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.