పేదల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

by Naveena |
పేదల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, వేములపల్లి : పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నామిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మొల్కపట్నం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పాదురి కిరణ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ సెక్రెటరీ పేరెల్లి నగేష్ తో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచి రేముడాల కర్ణాకర్, భారీ పాండు, కొమ్మనబోయిన ఆంజనేయులు, మామిడి అర్జున్, జేరిపోతుల సురేందర్, బొడ్డు జానకిరాములు, బొమ్మగాని దశరథ, బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed