BRS : పార్టీ డొనేషన్లలో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ టాప్-2.. వచ్చిన విరాళాలు ఎన్నంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2024-12-26 12:12:24.0  )
BRS : పార్టీ డొనేషన్లలో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ టాప్-2.. వచ్చిన విరాళాలు ఎన్నంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో : పార్టీ డొనేషన్లలో బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) తన వెబ్ సైట్‌లో వివరాలను వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ బీఆర్ఎస్ రూ.580 కోట్ల డొనేషన్లు పొందింది. రూ.2,244 కోట్లతో బీజేపీ టాప్‌లో నిలిచింది. కాంగ్రెస్ రూ.289 కోట్ల డొనేషన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఏపీలో టీడీపీకి రూ.100 కోట్లు డొనేషన్లు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అత్యధికంగా డొనేషన్లు ఇచ్చినట్లు ఈసీ డేటా తెలిపింది. ఈ సంస్థ బీజేపీకి రూ.723 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.156 కోట్లు చెల్లించినట్లు వెల్లడించింది. ఇదే సంస్థ బీఆర్ఎస్ పార్టీకి రూ.85 కోట్లు, వైఎస్ఆర్ సీపీకి రూ.62.5 కోట్లు డొనేషన్లు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ రెండు పార్టీలు ఈ సారి ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశాయి. బీఎస్పీ, బీజేడీ అసలు తమకు డొనేషన్లు రాలేదని స్పష్టం చేయడం గమనార్హం.

పార్టీ 2022-23 2023-24

బీజేపీ రూ.680.49 కోట్లు రూ.2.244 కోట్లు

బీఆర్ఎస్ రూ.683కోట్లు రూ.580 కోట్లు

కాంగ్రెస్ రూ.79.9 కోట్లు రూ.289 కోట్లు

ఆప్ రూ.37.1కోట్లు రూ.11.1కోట్లు

సీపీఎం రూ.6.1కోట్లు రూ. 7.6 కోట్లు

Advertisement

Next Story

Most Viewed