మీ జీవిత భాగస్వామి మీతో ఆ విషయాలు గురించి ఎక్కువగా చెబుతుందా.. అయితే జాగ్రత్త అంటున్న నిపుణులు

by Prasanna |
మీ జీవిత భాగస్వామి మీతో ఆ విషయాలు గురించి ఎక్కువగా చెబుతుందా.. అయితే జాగ్రత్త అంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్: పెళ్లి బంధంలో ఉండాల్సింది ప్రేమ.. ఉండకూడనది అనుమానం. వీరిద్దరూ ప్రేమగా ఉన్నప్పుడు.. ఆ బంధం అలాగే కొనసాగుతుందని ఎవరు కూడా చెప్పలేరు.. ఎందుకంటే మనుషుల అభిప్రాయాలు వేరుగా ఉంటాయి.. ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు.. ఇష్టం లేని పనులు చేసినప్పుడు మనసు పూర్తిగా విరిగిపోయి, ఓపిక కూడా నశిస్తుంది.. అప్పుడు కళ్లు తెరుచుకుని జాగ్రత్త పడతారు. మీరు మీ సంబంధాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని సంకేతాల గురించి మీ భాగస్వామి మీతో ఇలాంటి విషయాలు చెబుతూ ఉంటుంది. వీటిని మొదటిలోనే అంతం చేయండి లేదంటే మానసిక నష్టం తప్పదని తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు.

1. మీ జీవిత భాగస్వామి “నువ్వు ఎక్కువ సమయం నాకే కేటాయించాలి ” అని చెప్పినప్పుడు అది ఆప్యాయతకు చిహ్నం కాదు. ఇది ఒక హెచ్చరిక. దీన్నివిస్మరించకూడదని నిపుణులు చెబుతున్నారు.

2. మీ జీవిత భాగస్వామి " నేను నీతో తప్ప ఎవరితో ఎక్కువగా మాట్లాడను" అని పదే పదే చెబుతుంటే.. మిమల్ని మోసం చేయడానికి సిద్ధమవుతుందని అర్ధం.

3. "నేను నిన్ను మోసం చేయను.. నువ్వు ఒక్కడివి చాలు" అని ఆ విషయం గురించే .. మీ జీవిత భాగస్వామి మీకు చెబుతుంటే.. వారు ప్రత్యేకంగా మీతో సంబంధాన్ని కోరుకోవడం లేదని అర్ధం.

4. " మీకు కష్టం వచ్చినప్పుడు అది మీ సమస్య.. నా సమస్య కాదని" మీతో మీ జీవిత భాగస్వామి మీకు చెబుతుంటే.. ఆమె మీకు త్వరలో విడాకులు ఇవ్వనుందని అర్ధం.

5. "మీరు ఒకసారి తప్పు చేస్తే.. సందర్భం లేకపోయిన పదే పదే దాని గురించి.." మీ భాగస్వామి మీకు చెబుతుంటే.. ఆమె మనసులో మీరు లేరని అర్ధం.. ఈ విషయం మీరు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed