Nokia Feature Phones: ఫీచర్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లతో నోకియా నుంచి రెండు కొత్త 4జీ మొబైల్స్ రిలీజ్..!

by Maddikunta Saikiran |
Nokia Feature Phones: ఫీచర్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఫీచర్లతో నోకియా నుంచి రెండు కొత్త 4జీ మొబైల్స్ రిలీజ్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఫిన్లాండ్(Finland)కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా(Nokia) ఫీచర్ ఫోన్(Feature Phones)లకు భారత్(India)లో ఫుల్‌ క్రేజ్‌ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఆ సంస్థ మళ్లీ ఫీచర్‌ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో రెండు 4G ఫీచర్‌ ఫోన్‌లను ఆవిష్కరించింది. నోకియా 108 4G , నోకియా 125 4G పేరుతో ఈ రెండు ఫీచర్‌ ఫోన్‌లను లాంచ్ చేసింది. గతంలో తీసుకొచ్చిన HMD 105 4G, Nokia 110 4G రీబ్రాండ్‌ వెర్షన్స్‌గా వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నోకియా 108 ఫోన్‌ బ్లాక్‌(Black), సియాన్‌(Cyan), నోకియా125 ఫోన్‌ను బ్లూ(Blue),టైటానియం(Titanium) కలర్స్‌లో లభిస్తాయి. అయితే వీటి ధరలను మాత్రం కంపెనీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 2 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే వైర్‌లెస్ FM రేడియో, MP3 ప్లేయర్‌, వాయిస్‌ రికార్డర్‌, డ్యూయల్‌ ఫ్లాష్‌ లైట్‌ వంటి లేటెస్ట్ ఫీచర్లు వీటిలో ఉన్నాయి.64 జీబీ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. ఇక ఈ రెండు ఫోన్స్‌లో 2వేల వరకూ కాంటాక్ట్‌లు సేవ్‌ చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు 1450mAh కెసాపిటీ గల బ్యాటరీ, నానో సిమ్ కార్డ్ సపోర్ట్ కలిగి ఉన్నాయి. ఈ ఫోన్స్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 15 రోజుల స్టాండ్‌బై ఇస్తుంది. అలాగే ఎంతో పాపులర్ గేమ్‌ అయిన స్నేక్‌ గేమ్‌ను వీటిలో అందించారు.

Advertisement

Next Story