ఓవర్ నైట్‌లో అమ్మాయిని స్టార్‌ను చేసిన IPL మ్యాచ్.. ఆ 10 సెకండ్స్ ఏం జరిగిందంటే?

by Jakkula Samataha |
ఓవర్ నైట్‌లో అమ్మాయిని స్టార్‌ను చేసిన IPL మ్యాచ్.. ఆ 10 సెకండ్స్ ఏం జరిగిందంటే?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌ల హవా కొనసాగుతోంది. ఫ్యాన్స్ అరుపులతో స్టేడియమ్స్ దద్దరిల్లుతున్నాయి. ఏదైనా డ్యాన్స్‌తో కెమెరాకు చిక్కితే చాలు కొంత మంది స్టార్ హోదా సంపాదించుకుంటున్నారు. అయితే తాజాగా ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఆమె ఎవరు అని జనాలు తెగ వెతుకుతున్నారు. ఇంతకీ అసలు ముచ్చట ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య IPL CSK vs RCB మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మ్యాచ్‌ లో చెన్నై 36 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉండగా కెమెరా మెన్ ఒక అమ్మాయి పైకి కెమెరా ను ఫోకస్ చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తూ తెగ హడావిడి చేసింది. ఫుల్ జోష్‌తో ఆమె డ్యాన్స్ చేయడం అక్కడున్నవారందరినీ ఆకర్షించింది. 10 సెకండ్స్ వరకు ఉన్న ఆమె డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు.

వావ్ సూపర్ డ్యాన్స్.. నువ్వు గ్రేట్ అస్సలు నీలా యాక్టివ్‌గా ఉండాలి అంటూ ఆమెకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఇంతకీ నువ్వు సీఎస్‌కే ఫ్యాన్‌నా ఆర్సీబీ ఫ్యానా అంటూ ప్రశ్నిస్తూ తన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన కొందరు ఐపీఎల్ మ్యాచ్ ఎఫెక్ట్ ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.

Advertisement

Next Story