రెక్టిఫైడ్ స్పిరిట్ గోదాం పై ఎక్సైజ్ అధికారులు దాడులు

by Disha Web Desk 15 |
రెక్టిఫైడ్ స్పిరిట్ గోదాం పై ఎక్సైజ్ అధికారులు దాడులు
X

దిశ, పేట్ బషీరాబాద్ : ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 21 వేల లీటర్ల రెక్టిఫై స్పిరిట్ ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. పక్కా సమాచారంతో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం దూలపల్లి పారిశ్రామికవాడ సర్వేనెంబర్ 135 ప్లాట్ నెంబర్ 125లో శ్రీ జగదాంబ కెమికల్స్ పేరిట నిర్వహిస్తున్న గోదాం పై ఆకస్మిక దాడి చేశారు. ఇక్కడి గోదాములో ఎటువంటి అనుమతులు లేకుండా భారీ స్థాయిలో స్పిరిట్ ను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. మొత్తం 105 బ్యారెల్స్ లో ఒక్కొక్క బ్యారెల్ లో 200 లీటర్ల చొప్పున మొత్తం 21 వేల లీటర్లు 85 స్పిరిట్ ఉన్నట్లు, వీటి విలువ బహిరంగ

మార్కెట్లో రెండు కోట్ల 31 లక్షలు ఉన్నట్లుగా రంగారెడ్డి ఎక్సైజ్ ప్రొబిషన్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు. నిర్వాహకులు హనుమాన్ రామ్ సెన్, శ్రవణ్ కుమార్లను అరెస్టు చేసి గోదామును సీజ్ చేసినట్లు ఎక్సైజ్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కాగా ప్రొబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్, సీఐ లు బాలరాజు, సుభాష్ చందర్, ఎస్సై లు అఖిల్ కుమార్, వెంకటేష్, రవి ఇతర సిబ్బంది ఈ దాడులలో పాల్గొన్నారు. కాగా ప్రభుత్వ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలుసుకున్న ఇతర గోదాం నిర్వాహకులు తాళాలు వేసుకొని పరారయ్యారు. దీంతో దాదాపుగా పదుల సంఖ్యలో నిర్వహిస్తున్న కెమికల్ అక్రమ గోదాములు తాత్కాలికంగా మూతపడ్డాయి.

Next Story

Most Viewed