BIG BREAKING: బెంగళూరు శివారులో రేవ్ పార్టీ భగ్నం.. భారీగా డ్రగ్స్ స్వాధీనం, నటీమణుల పేర్లు తెరపైకి

by Shiva |   ( Updated:2024-05-20 07:48:52.0  )
BIG BREAKING: బెంగళూరు శివారులో రేవ్ పార్టీ భగ్నం.. భారీగా డ్రగ్స్ స్వాధీనం, నటీమణుల పేర్లు తెరపైకి
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు సిటీ శివారు ప్రాంతంలోని ఓ ఫాం హౌజ్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని సోమవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు జీఆర్ ఫాం హౌజ్‌లో ఉదయం 3 గంటల వరకు రేవ్ పార్టీ జరిగింది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు పకడ్బందీగా పార్టీ భగ్నం చేశారు. ఈ దాడుల్లో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సమా 15 ఖరీదైన కార్లను స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా ఈ పార్టీకి బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మందికి పైగా హాజరు కాగా అందులో 25 మందిపైగా యువతులు ఉన్నారు.

హైదరాబాద్‌కు చెందిని ఓ వ్యక్తి తన బర్త్ డే సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పార్టీ జరిగిన ఫాంహౌజ్‌లో ఏపీ సంబంధించిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ పేరులో స్టికర్ ఉన్న కారు దర్శనమిచ్చింది. అయితే, ఆ కారు తనది కాదని ఇప్పటికే ఎమ్మెల్యే కాకాణి వివరణ ఇచ్చారు. అనవసరంగా తన పేరును వాడుతున్నారని ఆరోపించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో మోడల్స్, టెకీలు, తెలుగు సినిమా నటీమణులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పార్టీలో పాల్గొన్న వారిలో కన్నడ మీడియాలో నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాను హైదరాబాద్‌లో ఉన్నట్లుగా హేమ వివరణ ఇచ్చింది.

Advertisement

Next Story