- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రాష్ట్రాల్లో ఐదు రోజులు హీట్ వేవ్: ఐఎండీ వార్నింగ్
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఈ రాష్ట్రాలు వేడి నుంచి ఉపశమనం పొందలేవని తెలిపింది. సోమవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌కు పెరుగుతుందని పేర్కొంది. అలాగే మంగళవారం నుంచి శుక్రవారం వరకు రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో, సోమ, మంగళవారాల్లో ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. అంతేగాక ఈ వారం మొత్తంలో గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్‌లోనూ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని స్పష్టం చేసింది.
ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాలలో ఆదివారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో 47.8 డిగ్రీలుగా నమోదైంది. ఇది గత మూడు రోజుల్లో దేశంలో రెండోసారి అత్యధికంగా నమోదైంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, అంటాలో 46.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హర్యానాలోని నుహ్‌లో 47.2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. అలాగే పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో అత్యధికంగా 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
సౌత్ ఇండియాలో భారీ వర్షాలు!
ఉత్తర భారత దేశంలో అత్యధిక వేడి పరిస్థితులున్నాయని వెల్లడించిన ఐఎండీ దక్షిణ భారతదేశంలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ వారం కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అధికంగా వర్షాలు ఉంటాయని తెలిపింది. లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాల్లో, అండమాన్ నికోబార్ దీవులలో వచ్చే ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఇప్పటికే సౌత్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.