నా ఫస్ట్ లవ్‌కు ఏడాది పూర్తయిందంటూ నిహారిక ఆసక్తికర పోస్ట్..

by Hamsa |   ( Updated:2024-05-20 05:13:27.0  )
నా ఫస్ట్ లవ్‌కు ఏడాది పూర్తయిందంటూ నిహారిక ఆసక్తికర పోస్ట్..
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక ఇటీవల భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అలాగే నిర్మాతగా మారి పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూనే.. హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చింది. నిహారిక నిత్యం తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫొటోలను, వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తుంది. అయితే గత కొద్ది కాలంగా మెగా డాటర్ ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఒక్కోసారి ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంటుంది. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చింది చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నిహారిక తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘డెడ్ పిక్సల్’ వెబ్ సిరీస్ విడుదలై ఏడాది పూర్తయిందని తెలుపుతూ నటుడు అక్షయ్ పెట్టిన పోస్ట్‌ను రీ షేర్ చేసింది. అందులో డెడ్ పిక్సల్ వెబ్ సిరీస్ పోస్టర్‌తో పాటు ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఉంది.

‘‘ నా ఫస్ట్ లవ్‌కు ఏడాది పూర్తి అయింది. లవ్ అంటే రెడ్ కలర్ హార్ట్ కాదు, లవ్ అంతే. థాంక్యూ ఆదిత్య మండల’’ అని ఉంది. అలాగే మేలో మళ్లీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా.. డెడ్ పిక్సల్ వెబ్ సిరీస్ గత ఏడాది మే 19న డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయి మంచి విజయం సాధించింది. అలాగే ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు దీనికి సీక్వెల్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story