నా భర్తను మిస్ అవుతున్నా.. తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-09 14:49:03.0  )
నా భర్తను మిస్ అవుతున్నా.. తారకరత్న భార్య అలేఖ్య ఎమోషనల్!
X

దిశ, సినిమా : నందమూరి తారకరత్న గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈయన మరణం తర్వాత తన భార్య అలేఖ్య చాలా రోజుల వరకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిది. ఇక ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయట పడి తన పిల్లలతో సంతోషంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తన భర్తను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యింది.

మరోసారి అలేఖ్య తన భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. బుక్ చదువుతూ ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో ఆమె లైట్ పింక్ సారీలో పుస్తకం చదువుతూ కనపిస్తుంది. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తారకరత్న‌ను చాలా మిస్ అవుతున్నాను అంటూ.. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అలేఖ్య, నందమూరి తారకరత్న‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా వీరి పెళ్లిని నందమూరి ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం తో, వీరు చాలా కాలం తమ కుటుంబానికి దూరంగా ఉన్నారు. ఇక అంతా సర్దుకొని, కుటుంబంతో కలిసిపోయాం అనుకునే‌లోపే, తారకరత్న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో నందమూరి ఫ్యామిలీ మాత్రమే కాకుండా, సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భాంతికి గురి అయ్యారు.


Read More...

మందు గ్లాస్‌తో దర్శనం ఇచ్చిన రష్మీ.. వైరల్ అవుతున్న ఫోటో!

Advertisement

Next Story