బైడెన్ ప్రకటన నిరాశపర్చింది: ఇజ్రాయెల్

by Dishanational2 |
బైడెన్ ప్రకటన నిరాశపర్చింది: ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేస్తే ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించింది. బైడెన్ హెచ్చరికలు తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ గురువారం పబ్లిక్ రేడియోలో మాట్లాడారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఎంతో మద్దతుగా ఉన్న బైడెన్ నుంచి ఆ మాట వినడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. హమాస్ చివరి మిగిలిన బెటాలియన్లకు రఫా నిలయంగా ఉందని అందుకే అక్కడ దాడి చేయాలని భావిస్తు్న్నామని స్పష్టం చేశారు. అయితే ఈజిప్టు సరిహద్దులో ఉన్న నగరం కూడా స్థానభ్రంశం చెందిన పాలస్తీనా పౌరులతో కిక్కిరిసి ఉందని పేర్కొంది. కాగా, రఫా నగరంపై దాడి చేస్తే ఆయుధాల పంపిణీ నిలిపివేస్తామని బైడెన్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ స్పందించింది. అయితే బైడెన్ ప్రకటన తర్వాత రఫాపై ఎటువంటి అటాక్స్ జరగలేదని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

Next Story

Most Viewed