నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో నియామకాలకు ఆహ్వానం

by Disha Web Desk 23 |
నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో నియామకాలకు ఆహ్వానం
X

దిశ,నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. మొత్తం 12 పోస్టులు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో డిసెక్షన్ హాల్ అటెండర్లు 4 ఉన్నాయి. పదో తరగతి లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అనాటమీ డిసెషన్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో కనీసం 1 సంవత్సర అనుభవం ఉండటం అర్హతలుగా పేర్కొన్నారు. ల్యాబ్ అటెండర్లు 4 పోస్టులున్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డీ ఎంఎల్టీ లో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలన్నారు. తప్పనిసరిగా తెలంగాణ పారామెడికల్ బోర్డుతో గుర్తింపు పొందాలి.

థియేటర్ అనస్థీషియా అసిస్టెంట్ పోస్టులు 4. అనస్థీషియా అసిస్టెంట్ కోర్సులో బీఎస్సీ ఎంఎల్టీ లేదా ఎంఎల్టీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. తెలంగాణ మెడికల్ బోర్డుతో గుర్తింపు పొంది ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను పూరించి దరఖాస్తు ఫారాలను నర్సంపేట లోని ఏరియా ఆసుపత్రిలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుకు చివరి తేదీ 24/4/2024, సాయంత్రం 5 గంటల లోపు ఒక సెట్ జిరాక్స్ సర్టిఫికేట్లను సమర్పించాలన్నారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియామకాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. దరఖాస్తుకు సంబంధించి సందేహాల కోసం 08718-230226 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు.

Next Story

Most Viewed