12 ఎంపీ సీట్లు గెలిపించండి : కేటీఆర్

by Disha Web Desk 11 |
12 ఎంపీ సీట్లు గెలిపించండి : కేటీఆర్
X

దిశ , జూబ్లిహిల్స్ : సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం జూబ్లిహిల్స్ లోని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో కేటీఆర్ మాట్లాడుతూ.... రాష్ట్రం లో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చేస్తానని గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ , శ్రీరామ్ నగర్ ఇదే ప్రాంతంలో మిమ్మల్ని అడిగితే మాగంటి గోపీనాథ్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించారు. అదే విధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పద్మారావు గౌడ్ ని గెలిపిస్తారని ప్రజలను వేడుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలో బి ఆర్ ఎస్ ని నమ్మి హైదరాబాద్ లో బి ఆర్ ఎస్ ని గెలిపించారు. కానీ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని ఎద్దేవ చేశారు. ప్రధాని మోడీ జన్ ధన్ ఎకౌంట్ లు తీసుకోండి 15 లక్షలు ఇస్తా అన్నాడు. 15 లక్షలు ఇచ్చాడా...? లక్ష ఉద్యోగాలు అన్నాడు ఇచ్చాడా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.

అలాగే రేవంత్ రెడ్డి కూడా ఇంట్లో కోడళ్ళకు 2500/- , ముసలి వారికి 4000/- అన్నాడు ఇచ్చాడా..? బీజేపీ , కాంగ్రెస్ అబద్దాల హామీలు చేస్తూ ప్రజలను మోసం చేశారని ఎద్దేవ చేశారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో కరెంట్ , వాటర్ కష్టాలు లేవని , కాంగ్రెస్ ప్రభుత్వంలో జూబ్లిహిల్స్ లో కరెంట్, వాటర్ కష్టాలు తీవ్రంగా ఉందని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి 12 పార్లమెంట్ సీట్లు అప్పజెప్పండి సంవత్సరం తిరిగేసరికి బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజలను కోరారు. నిన్న కాక మొన్న గులాబి కండువా కప్పుకున్న దానం నాగేందర్ సిగ్గులేకుండా ఇప్పుడు కాంగ్రెస్ లో ఎంపీ గా పోటీచేస్తున్నాడు. ఒకవేళ గెలిస్తే బీజేపీ లో చేరడనే గ్యారెంటీ ఏంటి అని ఎద్దేవా చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ బాటలో నడుస్తున్నాడా...?

మోడీ బాటలో నడుస్తున్నాడా.? రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని , రాహుల్ గాంధీ మోడీ , అదాని , అంబానీ తిడుతుంటే , రేవంత్ రెడ్డి వారితో దోస్తానా చేస్తున్నాడని కేటీఆర్ అన్నారు. ఐదు ఏళ్ళల్లో , కరోనా టైంలో కిషన్ రెడ్డి హైదరాబాదు ప్రజలకి కి కురుకురే ప్యాకెట్లు పంచాడు తప్ప చేసిందేమీ లేదని. అక్కరకు రాని కిషన్ రెడ్డి, బీజేపీ మనకు అవసరమా ...? రేవంత్ రెడ్డి వచ్చాడు కరెంట్, వాటర్, పెట్టుబడులు వెనకకు వెళ్ళపోతున్నాయని , గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ ని ఎలా గెలిపించారో అలా కారు గుర్తుకు ఓటు వేసి పద్మారావు ని గెలిపించాలని, కేసీఆర్ మీద ప్రేమ ఉంటే కారుని గెలిపించండి అని ప్రజలను కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్పొరేటర్ లు దేదీప్య , రాజ్ కుమార్ పటేల్ తదితరులున్నారు.

Next Story

Most Viewed