ఇవాళ్టి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్.. ఎంత కష్టం వచ్చిందో తెలుసా? (వీడియో)

by GSrikanth |   ( Updated:2024-05-17 07:07:13.0  )
ఇవాళ్టి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్.. ఎంత కష్టం వచ్చిందో తెలుసా? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. నేటి నుంచి దాదాపు పది రోజుల పాటు మూసి వేస్తున్నట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రెండు నెలలుగా కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కనీసం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రోజుకు వందమంది కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో కరెంట్ ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని ఆవేదన చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు 10 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, వేసవి అనగానే అందరికీ గుర్తొచ్చేది వినోదం, సినిమానే. వేసవిలో స్టార్ హీరోల చిత్రాలు విడుదలైతే ఒకటేంటి రెండు మూడు సార్లు కూడా చూడటానికి వెనుకాడరు.

తెలుగు చిత్రాలే కాకుండా ఇతర భాషల సినిమాలు సైతం మంచి టాక్ వినిపిస్తే చాలు థియేటర్లకు వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. అందుకే నిర్మాతలు కూడా వేసవిలో చిత్రాలు విడుదల చేసేందుకు ఎక్కువగా ప్లాన్ చేసుకుంటుంటారు. పాఠశాలలు, కళాశాలలు మళ్లీ రీఓపెన్ అయ్యేవరకు థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. అలాంటిది ఈసారి ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో కొత్త సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు వెనకడుగు వేశారు. దీంతో థియేటర్లకు వచ్చే సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఈ క్రమంలో పది రోజుల పాటు మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.


Advertisement

Next Story

Most Viewed