అందంగా కనిపించాలని నెయిల్ పాలిష్‌ వాడుతున్నారా?.. అంతకు ముందు ఇతి తెలుసుకోండి !

by Javid Pasha |
అందంగా కనిపించాలని నెయిల్ పాలిష్‌ వాడుతున్నారా?.. అంతకు ముందు ఇతి తెలుసుకోండి !
X

దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరూ తాము అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ఆరాట పడుతుంటారు. అందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అలాంటి వాటిలో నెయిల్ పాలిష్ ఒకటి. ఈరోజుల్లో ప్రతీ అమ్మాయి బ్యూటీ కిట్‌లో ఇది తప్పక ఉంటుంది అంటున్నారు బ్యుటీషియన్స్. ఇక పండుగలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి సందర్భాలు వస్తే అలంకరణలో భాగంగా నెయిల్ పాలిష్ ఉండాల్సిందే.. గోర్లపై రకరకాల రంగుల నెయిల్ పాలిష్‌ను అద్దుకుంటూ మురిసిపోయే వారు చాలామందే ఉంటారు. కానీ నెయిల్ పాలిష్ వాస్తవానికి ఆరోగ్యానికి హాని చేస్తుందట. ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం.

ఏ విధమైన హాని కలుగుతుంది?

* నెయిల్ పాలిష్‌ను తరచుగా యూజ్ చేయడంవల్ల గోర్లు నేచురాలిటీని కోల్పోతాయి. ఎందుకంటే ఇందులో హానికారక మెటల్స్ ఉంటాయి. పైగా ఇందులోని జెల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు వెంటనే ఆరిపోయేందుకు అవసరం అయిన యూవీ కిరణాలను ప్రొడ్యూ్స్ చేస్తుంది. ఇవి వ్యక్తుల్లో వృద్ధాప్య ఛాయలను, స్కిన్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్లను, అకాల మరణాల అవకాశాలను పెంచుతుంది. కాబట్టి జెల్ మేనిక్యూర్‌కు ముందు చేతులు, గోర్లపై సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం బెటర్. ఇక నెయిల్ పాలిష్ వాడకపోతే ఇంకా మంచిది.

* కొన్నిసార్లు పాత నెయిల్ పాలిషస్‌ను తొలగించి, కొత్తది పెట్టడానికి బ్యూటీ పార్లర్లలో రసాయనాలు వాడుతుంటారు. ఈ సందర్భంగా ఆ హానికారక కెమికల్స్ గోళ్లలోకి పోతుంది. దీంతో గోర్లు గరుకుగా మారడం, నేచురాలిటీని కోల్పోవడం జరగవచ్చు. పగుళ్లు ఏర్పడితే అందులో బ్యాక్టీరియా ప్రవేశించే చాన్సెస్ ఉంటాయి. ఆహారం తీసుకున్నప్పుడు ఇది నోటిద్వారా గొంతు, పొట్టలోకి చేరి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.

ఎలా నివారించాలి?

* ఎక్కువరోజులు మనగలిగే నెయిల్ పాలిష్‌ వాడకపోతే కాస్త బెటర్. ఎందుకంటే ఇందులో రసాయనాలు చాలా తక్కువ ఉంటాయి. రెండు వారాలకు మించి నెయిల్ పాలిష్ ఉంచుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి తొలగించాలి. జెల్ లేదా పౌడర్ డిప్ పాలిష్‌ను స్వయంగా మీరే తీసుకోవడంవల్ల గోళ్లకు హాని కలిగించవచ్చు. కాబట్టి ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మానిక్యూరిస్ట్‌‌ను సంప్రదించడం బెటర్. ఇక సెలూన్లు, బ్యూటీపార్లర్లలో నెయిల్ పాలిష్ తొలగించడానికి యూవీ లైట్లకు బదులు ఎల్ఈడీ లైట్లను ఉపయోగిస్తే రిస్క్ తగ్గుతుంది.

* తరచూ వాడితే రిస్క్ కాబట్టి నెయిల్ పాలిష్ వాడకపోతే మంచిది. ఇక తప్పక వాడాల్సి వస్తే మాత్రం ప్రత్యేక సందర్భాలలోనే వాడండి. అలాగే ముందు జాగ్రత్తలో భాగంగా తక్కువ హానికారక రసాయనాలు కలిగి బ్రాండ్‌లను కొనుగోలు సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలు లేనివాటిని ఉపయోగించండి.

Advertisement

Next Story

Most Viewed