మహారాష్ట్ర ఎన్నికలకు 14 మందితో కాంగ్రెస్ కొత్త జాబితా విడుదల

by S Gopi |
మహారాష్ట్ర ఎన్నికలకు 14 మందితో కాంగ్రెస్ కొత్త జాబితా విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే నెలలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం 14 మందితో కూడిన కొత్త జాబితాను విడుదల చేసింది. ఈ కొత్త జాబితాతో మహా వికాస్ అఘాడి కూటుమిలో భాగమైన కాంగ్రెస్ ఇప్పటివరకు 99 మంది అభ్యర్థులను ప్రకటించింది. గతవారాంతం శనివారం 16 మందితో కూడిన లిస్ట్ విడుదల చేసిన కాంగ్రెస్, తాజా జాబితాలో అంధేరి(వెస్ట్) నియోజకవర్గం నుంచి సచిన్ సావంత్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే అశోక్ జాదవ్‌ను, ఔరంగాబాద్ తూర్పు స్థానం నుంచి మధుకర్ దేశ్‌ముఖ్ స్థానంలో లాహూ షెవాలే పేర్లను సవరించింది. ఇతర అభ్యర్థుల్లో చంద్రపూర్ జిల్లాలోని వరోరా నుంచి ప్రవీణ్ కాకడే, అమలేర్ నుంచి డా అనిల్ నాథూ షిండె, ఆర్మోరి(రాందాస్ మాస్రం), చంద్రపూర్(ప్రవీణ్ నానాజీ పడ్వేకర్), ఉమ్రేడ్(సంజయ్ నారాయణరావు మెష్రామ్), నాందేడ్ నార్త్(అబ్దుల్ సత్తార్ అబ్దుల్ గఫూర్), నలసోపరా(సందీప్ పాండె), బల్లార్ పూర్(సంతోష్ సింగ్ చందన్ సింగ్ రావత్), శివాజీ నగర్(దత్తాత్రెయ బహిరత్), షోలాపూర్ సౌత్(దిలీప్ బ్రహ్మదేవ్ మానె), పండర్‌పూర్(భగీరథ భాల్కె), పూణె కంటోన్మెంట్(రమేష్ ఆనందరావు భాగ్వె) ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed