హాస్టల్‌లో ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

by samatah |
హాస్టల్‌లో ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, కరీమాబాద్ : హన్మకొండ నగరంలో ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మురారి శెట్టి నాగజ్యోతి బుధవారం హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మృతురాలి స్నేహితుల వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామం చెందిన ఇంటర్ విద్యార్థిని బుధవారం ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కు హాజరై రాత్రి సుమారు 9గంటల సమయంలో కళాశాల హాస్టల్ లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకోగా గుర్తించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించగా వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మురారి శెట్టి నాగజ్యోతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏమి జరిగింది ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story