- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం సేకరించాలి

దిశ, హనుమకొండ : చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించడం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ప్రధాన కర్తవ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ అన్నారు. గురువారం వరంగల్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో తన కార్యాలయంలో సీపీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ముందుగా పోలీసు అధికారులు నిర్వహిస్తున్న విధుల తీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఖచ్చితమైన సమాచారాన్ని ఖచ్చితమైన సమయానికి అందజేయాలని, స్థానికంగా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని, రౌడీ షీటర్ల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయాలని, భూకజ్జాలకు పాల్పడే వారి సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
అధికారులు క్షేత్ర స్థాయిలో ఎక్కువ సమాయాన్ని కేటాయించాలని, భవిష్యత్తులో జరిగే సంఘటనలపై నిఘా ఉండాలని, తక్కువ మాట్లాడుతూ ఎక్కువ సమాచారాన్ని సేకరించాలని, పాస్ పోర్ట్ విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రతిభ కబరిచిన వారికి రివార్డు అందజేస్తామన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కిర్తీ ప్రతిష్టలు స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పైనే ఆధారపడి ఉందన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీలు జితేంద్ రెడ్డి, పార్థసారధి, రాజు, గురుస్వామి, శేఖర్, సంజీవ్, చంద్రమోహన్,డీఏఓ ఇషాక్ తో పాటు ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.