రోజూ పళ్లు ఎన్నిసార్లు తోమాలి.. గర్భధారణ సమస్యలతో ఇది ఎలా ముడిపడి ఉంది?

by Anjali |
రోజూ పళ్లు ఎన్నిసార్లు తోమాలి..  గర్భధారణ సమస్యలతో ఇది ఎలా ముడిపడి ఉంది?
X

దిశ, వెబ్‌డెస్క్: గర్భిణీ స్త్రీలు (Pregnant women) ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే. నడవడంలో, తీసుకునే ఫుడ్ విషయంలో కానీ.. జాగ్రత్తలు వహిస్తారు. అలాగే నోటి ఆరోగ్యం, వారి పిల్లలలో పుండ్లు ఏర్పడే ప్రమాదం మధ్య సంబంధం అందరికీ తెలిసిందే. ఇటీవలి అధ్యయనం ప్రకారం గర్భిణీ స్త్రీలలో నోటి ఆరోగ్య సంరక్షణ లేకపోవడం సమస్యల మధ్య సంబంధం ఉందని తేలింది. మీరు బిడ్డను కంటున్నట్లయితే నిపుణులు చెప్పిన ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే. గర్భధారణ సమయంలో మహిళలు పీరియాంటల్ వ్యాధి(Periodontal disease), కావిటీస్‌కు ఎక్కువగా గురవుతారని నిపుణులు చెబుతున్నారు.

గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్య సంరక్షణ, గర్భధారణ ఫలితాలపై దాని ప్రభావంపై అనేక అధ్యయనాలు జరిగాయి. అయితే, అల్బానీలోని విశ్వవిద్యాలయంలోని ఓరల్ హెల్త్ వర్క్‌ఫోర్స్ రీసెర్చ్ సెంటర్ (Oral Health Workforce Research Center) నిర్వహించింది. ఇటీవల ఈ అధ్యయనంలో గర్భధారణ సమయంలో మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల గర్భధారణ టైంలో మధుమేహం, రక్తపోటు సంభవం తగ్గుతుందని కనుగొంది.

అమెరికాలో ముఖ్యంగా మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు నోటి ఆరోగ్యం వెనుకబడి ఉంది. గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్య సేవల వినియోగం తక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ఇక 2016, 2020 మధ్య కాలంలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్వహించే డేటా పూల్ అయిన ప్రెగ్నెన్సీ రిస్క్ అసెస్‌మెంట్ మానిటరింగ్ సిస్టమ్ (PRAMS) నుంచి డేటాను పరిశోధకులు విశ్లేషించారు.

వారు గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా నివారణ నోటి ఆరోగ్య సంరక్షణ లేకపోవడం అండ్ దంత చికిత్సను ఆలస్యం చేయడం వల్ల పీరియాంటల్ వ్యాధి వంటి దంత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతున్నాయని వెల్లడించారు. ఇది గర్భధారణ సమయంలో మధుమేహం(diabetes), అధిక రక్తపోటు (high blood pressure) రుగ్మతలతో ముడిపడి ఉందని చెబుతున్నారు.

అయితే నివారణ నోటి ఆరోగ్య సంరక్షణ పొందిన మహిళల్లో ఈ రుగ్మతలు వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ‘మా పరిశోధనలు నోటి ఆరోగ్యం, మొత్తం ఆరోగ్యం మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తాయి’ అని సెంటర్ ఫర్ హెల్త్ వర్క్‌ఫోర్స్ స్టడీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సిమోనా సుర్డు ఒక ప్రకటనలో తెలిపారు.

ఓరల్ హెల్త్ ఎడ్యుకేషన్ (Oral Health Education)అండ్ సేవలను ప్రసూతి ఆరోగ్య సంరక్షణలో అనుసంధానించడం అలాగే శిక్షణ, మెరుగైన పంపిణీ, ప్రినేటల్ కేర్ ప్రొవైడర్లతో ఇంటర్‌ప్రొఫెషనల్ సహకారం ద్వారా నోటి హెల్త్ వర్క్‌ఫోర్స్‌ను విస్తరిస్తుందని అన్నారు.

CDC ప్రకారం.. నోటి ఆరోగ్యం ప్రినేటల్ కేర్‌లో ముఖ్యమైన భాగం. గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల తల్లి అలాగే బిడ్డ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. గర్భధారణ సమయంలో దంత సంరక్షణ సురక్షితంగా ఉంచుకోవడం మేలని ఆరోగ్య సంస్థ పేర్కొంది. 2019లో CDC, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP)తో కలిసి ప్రొటెక్ట్ టైనీ టీత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాగా ప్రెగ్నెన్సీ సమయంలో తప్పకుండా రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story

Most Viewed