సీతారామ ప్రాజెక్ట్ మాజీ సీఎం కేసీఆర్ కళ : మాజీ ఎమ్మెల్యే

by Kalyani |
సీతారామ ప్రాజెక్ట్  మాజీ సీఎం కేసీఆర్ కళ : మాజీ ఎమ్మెల్యే
X

దిశ, ఏన్కూర్ : శ్రీ సీతారామ ప్రాజెక్టు అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న ప్రాజెక్ట్ అని, పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి పనులు వెంటనే పూర్తి చేయాలని వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఇమామ్ నగర్ గ్రామ సమీపంలో జరుగుతున్న శ్రీ సీతారామ ప్రాజెక్టు పనులను మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీ సీతారామ ప్రాజెక్టు లింక్ జలాల్ లింక్ కెనాల్ నిర్మాణంతో వైరా నియోజకవర్గ సస్యశ్యామల మవుతుందని ఊహించడం జరిగిందని, కానీ ఇక్కడ ప్రాజెక్టు పనులు చూస్తే చివరి ఆయకట్టు వరకు సాగునీరు అదే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రపు నిధులు కేటాయించి శ్రీ సీతారామ ప్రాజెక్టు పనులను నత్తనడక నడిపిస్తున్నారని, ఈ విధంగా చేసుకుంటా పోతే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 50 సంవత్సరాలు పడుతుందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్ పేరు వస్తుందని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా కాలయాపన చేస్తుందన్నారు. తక్షణమే శ్రీ సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. లేకపోతే బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆమె వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటికాల రాజు, వినోద్, బాజీ, శ్రీ సీతారామ ప్రాజెక్ట్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story