- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పరీక్షలు ప్రశాంతంగా పూర్తి కావాలి.. ఎస్పీ జానకి

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్షలు ప్రశాంతంగా పూర్తి కావాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు. శనివారం ఆమె పట్టణంలోని పోలీస్ లైన్ హైస్కూల్, అపెక్స్, తక్షశిల హై స్కూళ్ళలో పరీక్షల భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్దకు అనవసరంగా ఎవ్వరూ రాకూడదని, విద్యార్థుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ నియంత్రీకరించాలని, పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, అధికారులు, సిబ్బంది సెల్ ఫోన్లను అనుమతించరాదని ఆమె కఠినంగా ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్, ఇంటర్నెట్, స్టేషనరీ షాపులు మూసి ఉంచాలని, విజిల్స్, మైక్, లౌడ్ స్పీకర్లు మోగరాదని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది క్రమంగా పహారా ఉండాలని, కేంద్రాల సమీపంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికల పై ప్రత్యేక నిఘా పెట్టాలని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి చిన్న అంశాన్ని పర్యవేక్షించాలని, పరీక్షలు రాసే అమ్మాయిలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మహిళా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు.