రాష్ట్ర ప్రభుత్వం ఎదుట హరీష్ రావు కీలక డిమాండ్

by Gantepaka Srikanth |
రాష్ట్ర ప్రభుత్వం ఎదుట హరీష్ రావు కీలక డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly) మంత్రి సీతక్క(Minister Seethakka) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బడ్జెట్‌లో రైతు భరోసాకు రూ.930 కోట్లు పెట్టారు.. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.600 కోట్లు పెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఏకంగా రైతు భరోసా(Rythu Bharosa)కు రూ.330 కోట్ల రూపాయలు కోత పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు 1 కోటి 2 లక్షల మంది ఉన్నారని.. వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Atmiya Bharosa) ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్(BRS) హయాంలో రాళ్లకు, గుట్టలకు రైతుబంధు ఇచ్చామని ఆరోపిస్తున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే రికవరీ చేయండి అని ప్రభుత్వానికి హరీష్ రావు సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఇచ్చేది.. రూ.12 వేలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లో 10 గుంటల వారసత్వ భూమి కూడా ఉన్నది.. అంటే వారికి ఇచ్చేది రూ.3 వేలేనా? అనేది క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఎకరం లోపు భూమి ఉన్న ఉపాధి కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.



Next Story