- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TSRJC-2025:పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లోని పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ(TSRJC CET-2025) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలురకు 15, బాలికలకు 20 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు. గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు ప్రస్తుతం 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్ ద్వారా https://tgrjc.cgg.gov.in/TGRJDCWEB20/#!/home0103prsvdf.rps అప్లై చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి. దరఖాస్తులకు ఏప్రిల్ 23 చివరి తేదీగా ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న వారికి మే 10వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు MPC, బైపీసీ, MEC గ్రూపుల్లో కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు పొందుతారు. పరీక్షలో విద్యార్థులు పొందిన మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 040-24734899 నెంబర్‌కు ఫోన్ చేయండి.