అనారోగ్యంతో బాధపడుతున్న మెగాస్టార్.. శబరిమలలో స్టార్ హీరో పూజలు చేయించడంతో కంగారు పడుతున్న ఫ్యాన్స్

by Hamsa |
అనారోగ్యంతో బాధపడుతున్న మెగాస్టార్.. శబరిమలలో స్టార్ హీరో పూజలు చేయించడంతో కంగారు పడుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులతో పాటు, సినీ సెలబ్రిటీలు సైతం కంగారు పడుతున్నారు. నిత్యం ఆయన గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మోహన్ లాల్(Mohanlal) మెగాస్టార్ పేరుపై శబరిమలలో ప్రత్యేక పూజలు చేయించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనపై పలు విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. అసలు ఏం కాలేదని టీమ్ ప్రకటించింది మరి మీరు ఎందుకు పూజలు చేయించారని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. దీంతో ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘అతని కోసం పూజలు చేస్తే తప్పేంటి? అది నా వ్యక్తిగత విషయం

. ప్రస్తుతం అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. అలాంటి ఆరోగ్య సమస్య అందరికీ వస్తుంది. కాబట్టి ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోహన్‌లాల్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆయనకు అసలు ఏమందో అని కంగారు పడుతున్నారు. కాగా, ప్రస్తుతం మోహన్ లాల్ ‘L-2: ఎంపురాన్’(L-2: Empuran) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 27న అంటే రేపు థియేటర్స్‌లోకి రానుంది. దీంతో మోహన్‌లాల్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.

Next Story

Most Viewed