'ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ అమలుపై సన్నాహక సమావేశం

by Naveena |
ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ అమలుపై సన్నాహక సమావేశం
X

దిశ, తిమ్మాపూర్ : త్వరలో ప్రారంభించనున్నఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం అమలుపై శుక్రవారం ఎల్ ఎండి లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరు మండలాల ఎంపీడీవోలు, తహసీల్ధార్లతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల చెంతకే వెళ్లి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు తోడ్పాటునందించాలని కోరారు. గ్రామ సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయానికి ప్రత్యేకమైన యాప్ ను రూపొందిచామన్నారు. ఈ యాప్ ద్వారా ప్రజల నుంచి వచ్చే విన్నపాలను పరిష్కరించేందుకు రోజుకు మూడు గ్రామాలకు ప్రత్యకంగా తయారు చేయించిన వాహనంలో అధికారులతో కలిసి వెళ్లడం జరుగుతుందన్నారు.

ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు యాప్ ద్వారా తెలియజేసిన సమస్యల గురించి తెలుసుకొని అప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. మంచి ఉద్దేశంతో చేపట్టే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని, సమస్యల పరిష్కరించేందుకు పాటుపడాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఇంజినీర్లు రవి ప్రకాశ్, మంజులా భార్గవి, తహశీల్దార్లు కె.వరలక్ష్మి, బత్తుల భాస్కర్, విజయ్ కుమార్, ఎంపీడీవోలు విజయ్ కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్, వై.శశికళ, డిప్యూటీ తహసీల్దార్లు సమ్మయ్య, నర్సింహచారి, గోపాల్, సత్యనారాయణ, ఏఈలు సురేందర్ రెడ్డి, స్నేహాజ్యోతి, వ్యవసాయ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్, సంతోష్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.



Next Story