- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గార్లలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ..
దిశ, గార్ల : దసరా పండగ రోజు శనివారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మసీద్ సెంటర్ లో గార్ల మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీవో మంగమ్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. నైజాం నవాబుల కాలంలో దసరా రోజు నైజాం నవాబు నీలిరంగు జెండాల్లో నెలవంక గల జెండా ఎగరవేసేవారని, నైజాం నవాబు కాలం అంతరించిన నాటి నుంచి ప్రతి ఏటా దసరా పండుగ రోజున గార్ల మసీద్ సెంటర్లో జాతీయ జెండా ఆవిష్కరించడం ఆనవాయితిగా వస్తుంది. దేశంలో ఎక్కడ లేనివిధంగా విజయదశమి రోజు జాతీయ జెండా ఆవిష్కరించడం గార్లలో కొన్నేళ్లుగా కొనసాగుతుందన్నారు. 1952 లో గార్ల టౌన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా మాటేటి కిషన్ రావు ఎన్నికయ్యారు. నాటి దసరా పండుగ రోజు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మసీద్ సెంటర్లో కాంగ్రెస్ జెండా ఎగిరేశారు.
అప్పట్లో గార్ల మసీద్ సెంటర్ లో జెండా గద్దె వద్ద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుండగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నాయకుల మధ్య ఘర్షణ జరిగాయి. ఈ విషయం పై హై కోర్టుకు వెళ్లగా హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా, మతసామరస్యానికి ప్రతీకగా జాతీయ జెండా ఎగరేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో నాడు గార్ల మున్సిపల్ చైర్మన్ మాటేటి కిషన్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. నాటి నుంచి ఇదే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. గార్ల మేజర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీవో మంగమ్మ ఆధ్వర్యంలో మసీద్ సెంటర్ లో ని గద్ద పై ఎంపీడీవో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల సెక్రెటరీ కిషోర్, మాజీ సర్పంచులు అజ్మీర బన్సీలాల్, గంగావత్ లక్ష్మణ్ నాయక్, గార్ల బయ్యారం సీఐ రవికుమార్, గార్ల ఎస్సై జీనత్ కుమార్, గార్ల మండల నాయకులు హతిరామ్, తోడేటి శీను, కందునూరి శీను, మురళి, ఈశ్వర్ లింగం గార్ల మండల ప్రజలు పాల్గొన్నారు.