- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ ఎన్ఐటీలో సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ప్రారంభం..
దిశ, కేయూ క్యాంపస్: దేశంలోనే ప్రతిష్టాత్మక నిట్ వరంగల్ లో సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్‌లో 3డీ ప్రింటింగ్ పరికరాలను డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ. రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ వరంగల్ ఎన్‌ఐటీ లోని సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. అతి త్వరలో ఈ సదుపాయం మొత్తం 18 ల్యాబ్‌లను సిద్ధం చేసి వివిధ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. ఈ పరికరాల విలువ రూ. 65లక్షలు అని, పరికరాలు క్రియాత్మకమైన ఉత్పత్తులను సృష్టించగలవన్నారు.
తయారీ ప్రక్రియలో ఉన్న అసెంబ్లీని నివారించగలవని, మొదట ప్రొడక్ట్ 3డీ స్ప్రింట్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి రూపొందించబడుతుందన్నారు. ప్రొడక్ట్ స్ప్రింట్ యొక్క ప్రింటింగ్ తయారు చేయబడుతుందని తెలిపారు. ఎంఓయూ ప్రకారం మూడేళ్లలో 30,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 18 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీఈఓ ప్రొఫెసర్ ఎల్.కృష్ణానంద్, వివిధ ల్యాబ్‌ల ఇంచార్జ్ ప్రొఫెసర్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డీన్‌లు, అడ్వైజర్లు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ప్రొఫెసర్లు, రీసెర్చ్ విద్యార్థులు పాల్గొన్నారు.