- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచండి: కలెక్టర్ శశాంక
దిశ, మహబూబాబాద్ టౌన్: అంగన్వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులలో, గర్భిణీలలో పౌష్టికాహార లోపాన్ని నిరోధించేందుకు సమష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పౌష్టికాహారం క్రమబద్ధంగా పంపిణీ అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో 1,435 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వాటిలో అద్దె చెల్లించే 463అంగన్వాడీ కేంద్రాల వివరాలు ఇవ్వాలన్నారు.
గ్రామాలలో అంగన్వాడి కేంద్రాల పటిష్టతకు సర్పంచుల సహకారం ఎంతో ఉపయోగకరమన్నారు. వైద్య శాఖ అధికారులు అంగన్వాడి కేంద్రాలను సందర్శించి గర్భిణీలను, తల్లీ బిడ్డలలో హీమోగ్లోబిన్ శాతం పరిశీలిస్తూ నివేదిక సమర్పించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల నుంచి పాఠశాలల్లో చేరే చిన్నారులకు వాళ్ల సామర్థ్యాన్ని తెలిపే పరీక్షలు నిర్వహించాలని మార్కుల లిస్టును కూడా ఇవ్వాలన్నారు. ఏజెన్సీలో నిర్మించే అంగన్వాడీ కేంద్రాల భవనాల కొరకు చేపట్టిన పనులపై సమగ్ర నివేదిక అందజేయాలన్నారు.
అంగన్వాడీ ఉద్యోగుల వివరాల నివేదిక ఇవ్వాలని, అలాగే ఖాళీ వివరాలను కూడా సమర్పించాలన్నారు. ఐసీడీఎస్ అధికారులు ప్రతినెల సెక్టార్ వారీగా మేళా నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరును గుర్తించి ర్యాంకింగ్ ను బట్టి వారిని సన్మానించుకోవడం జరుగుతుందన్నారు. క్యాష్ ప్రైస్ లు ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని నర్మద, డాక్టర్ రాజకుమార్ ఉపవైద్యాధికారి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.